సూక్ష్మ మధ్యతరహా కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీ స్టార్ట్ ప్యాకేజి కింద 1110 కోట్లను ఏపీ సర్కార్ ఇవ్వనుంది. ఈ నేపధ్యంలోనే తొలి విడతగా 450 కోట్లను విడుదల చేసింది. చిన్న పరిశ్రమలకు రీ స్టార్ట్ ప్యాకేజి ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 97 వేల కంపెనీలకు ప్రభుత్వం అండగా నిలబడనుంది. 

 

దాదాపు పది లక్షల మందికి ఇప్పుడు మళ్ళీ ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇక కేంద్రం కూడా వారి కోసం నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 3 లక్షల కోట్ల ప్యాకేజిని వారి కోసం కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీ సర్కార్ మినహా ఏ రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: