ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం చేయూత ఇస్తున్నట్టు తెలిపారు. రెండు విడతల్లో 1,110 కోట్ల రూపాయల ప్రోత్సాహకం అందజేస్తామని అన్నారు. స్థానికంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని సీఎం అన్నారు. కలెక్టర్లు కూడా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టాలని అన్నారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని సీఎం చెప్పారు. 
 
లాక్ డౌన్ సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు 828 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని తెలిపారు. పరిశ్రమలను అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం తెలిపారు. ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: