లాక్ డౌన్ లో ఆదాయం కోల్పోయి ఉత్పత్తి లేక నానా ఇబ్బందులు పడుతున్న చిన్న మధ్యతరగతి కంపెనీలకు ఏపీ సర్కార్ అండగా నిలబడింది. వారికి వారాల జల్లు కురిపించారు సిఎం వైఎస్ జగన్. 6 నుంచి 8 శాతం రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆర్ధిక పరిస్థితి కష్టంగా ఉన్నా సరే వారికి అండగా ఉంటున్నామని జగన్ చెప్పారు. 

 

నిర్వహణ మూలధనం రుణాలను 200 కోట్లకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చిన్న మధ్యతరహా కంపెనీలకు ఆరు నెలల మారిటోరియం ఉంటుందని జగన్ చెప్పారు. ఏప్రిల్ మే జూన్ నెలల స్థిర విద్యుత్ చార్జీలు 188 కోట్లను మాఫీ చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని అందుకే తాము అండగా నిలబడ్డామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: