తెలుగుదేశం ప్రభుత్వం చిన్న మధ్యతరహా కంపెనీలను ఆదుకోలేదు అని తాము ఇప్పుడు వారికి అండగా నిలుస్తున్నామని ఏపీ సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం 800 కోట్ల వరకు ఎగ్గొట్టింది అని ఇప్పుడు తాము బాకీలను చెల్లిస్తున్నామని భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

 

కాసేపటి క్రితం వారితో వీడే కాన్ఫరెన్స్ లో జగన్ మాట్లాడారు. చంద్రబాబు సర్కార్ కారణంగా పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని జగన్ ఆరోపించారు. ఇక వారికి తక్కువ వడ్డీ కే రుణాలను ఇవ్వడం తో పాటుగా ఆరు నెలల పాటు మారిటోరియం కూడా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. వారి వలన స్థానికులకు ఉపాధి వస్తుందని కాబట్టి అవి మనుగడ సాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని జగన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: