రాష్ట్రంలో చిన్న మధ్యతరహా కంపెనీలను ఆదుకుంటే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానికులకు ఉపాధి ఇచ్చేది ఈ కంపెనీలు అని లాక్ డౌన్ కారణంగా ఆ కంపెనీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని అందుకే వారిని ఆదుకుంటున్నామని చెప్పారు జగన్. 

 

ఇక ఇది పక్కన పెడితే ఆ కంపెనీల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని జగన్ ఈ సందర్భంగా వివరించారు. 75 శాతం స్తానిక రిజ‌ర్వేష‌న్లు స్థానికుల‌కే అని స్పష్టం చేసారు. భవిష్యత్తులో వారికి నిధులు అందిస్తామని ప్రస్తుతం 450 కోట్లను విడుదల చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చెల్లించని వాటిని కూడా తాము చెల్లిస్తున్నామని పేర్కొన్నారు ఆయన. దీనిపై కంపెనీల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: