ఏపీ హైకోర్టులో ఈరోజు డాక్టర్ సుధాకర్ ఘటనపై విచారణ జరిగింది. హైకోర్టు సుధాకర్ పై దాడి చేసిన పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఎనిమిది వారాల్లో సీబీఐకి అధికారులు నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్య సిబ్బందికి మాస్కులు ఇవ్వడం లేదని గతంలో గొడవ చేసి సుధాకర్ సస్పెండ్ అయ్యారు. తాజాగా జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 
 
పోలీసులు తమను, సీఎంను దుర్భాషలాడటంతో సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. డాక్టర్ సుధాకర్ పై పోలీసులు చేయి చేసుకున్నారు. విధులకు ఆటంకం కలిగించాడని కేసు నమోదు చేశారు. సుధాకర్ ఘటనపై ఆయన సన్నిహితులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: