మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెళ్లైన రెండో రోజే వధువుకు కరోనా నిర్ధారణ అయింది. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశించిన వధూవరులకు వింతచిక్కు వచ్చిపడింది. వధువుకు కరోనా నిర్ధారణ కావడంతో 30 మంది కుటుంబాల్లో కలవరం మొదలైంది. మధ్యప్రదేశ్ లోని రైసెన్ జిల్లా సత్లాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ లో సడలింపులతో పెళ్లి చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో ఒక యువకుడు భూపాల్ కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. 
 
పెళ్లికి 50 మందికి అనుమతి ఇవ్వగా సోమవారం 30 మందితో కలిసి వారి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. తాజాగా వధువుకు కరోనా నిర్ధారణ కావడంతో పెళ్లికి హాజరైన వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 5981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 2483 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్చ్ కాగా 270 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: