హైకోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మాజీ నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ని హైకోర్ట్ ఎత్తేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ని హైకోర్ట్ నిలిపి వేయడమే కాకుండా క్యాట్ ఆయన సస్పెన్షన్ ని సమర్ధిస్తూ ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టేసింది. 

 

ఆయనను విధుల్లోకి తీసుకోవాలని సూచనలు చేసింది. ఆయన జారీ చేసిన రిట్ పిటీషన్ ని హైకోర్ట్ పరిగణలోకి తీసుకుని విచారణ చేపడుతూ ఈ తీర్పు ఇచ్చింది. కాగా ఆయన ప్రభుత్వంలో ఉంటూ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు చేస్తూ ఆయనను ఏపీ సర్కార్ తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడిపై కూడా అభియోగాలు మోపింది హైకోర్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: