కొవిడ్‌-19 సృష్టించిన‌ సంక్షోభం, లాక్‌డౌన్ కార‌ణంగా అనేక రంగాలు దెబ్బ‌తింటున్నాయి. ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి. ఉన్న‌వాళ్ల‌లో జీతాల కోత‌లు పెడుతున్నాయి దిగ్గజాలనుంచి స్టార్టప్‌ కంపెనీల దాకా  ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నాయి. కానీ.. ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్‌ మాత్రం దీనికి భిన్నంగా ముందుకు వెళ్తోంది. తమకు 50 వేల సిబ్బంది అసవరం పడుతుందని అమెజాన్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 50వేల మందిని నియమించుకోనున్నామని తెలిపింది.

 

అమెజాన్‌ ఫ్లెక్స్‌లో స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్  ఉద్యోగాల కింది వీరిని తీసుకుంటామని తెలిపింది. భారతదేశం అంతటా అమెజాన్‌ కేంద్రాలు,  డెలివరీ నెట్‌వర్క్‌లో ఈ అవకాశాలుంటాయని కంపెనీ  ప్రకటించింది. ఈ క‌రోనా మహమ్మారి సమయంలో వీలైనంత ఎక్కువ మందికి  సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తామని అమెజాన్ కస్టమర్ ఫిల్లిమెంట్ ఆపరేషన్స్, విపి అఖిల్ సక్సేనా ఒక ప్రకటనలో వెల్ల‌డించారు. ఈ వార్త‌తో నిరుద్యోగులు ఆనంద‌ప‌డుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: