తెలంగాణాలో అటవీ జంతువుల హడావుడి ఇప్పుడు ప్రజలను బాగా కంగారు పెడుతుంది. జనాలు బయటకు రావాలి అంటేనే ఇప్పుడు అవి ఎక్కడ దాడి చేస్తాయో అనే విధంగా ఉంది కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఒక ఎలుగుబంటి ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా ఉండటంతో అది బయటకు వచ్చి దాడి చేసింది. 

 

కామారెడ్డి జిల్లా రామా రెడ్డి మండలంలోని కన్నా పూర్ లో అది గ్రామస్తులపై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు గ్రామస్తులు తీవ్రంగా గాయపడటం తో వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు దాన్ని కర్రలతో కొట్టి చంపారు. దీనిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: