తెలంగాణాలో పదో తరగతి పరిక్షలకు రంగ౦ సిద్దమైంది. పరీక్షలను నిర్వహించడానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ చర్యలకు దిగింది. అదనంగా 2500 సెంటర్లలో పరీక్షలను నిర్వహించడానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇక సామాజిక దూరం పాటిస్తూ ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 

దీనిపై మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడారు. విద్యార్ధులకు పరీక్షలను సామాజిక దూరం పాటిస్తూ నిర్వహిస్తామని మాస్క్ తప్పని సరి అని స్పష్టం చేసారు. విద్యార్ధుల తల్లి తండ్రులే వారిని వచ్చి తీసుకుని వెళ్ళాలి అని ఆమె సూచించారు. అదే విధంగా హడావుడి లేకుండా పరిక్షలకు రావాలని ఆమె సూచించారు. 2500 సెంటర్లలో పరిక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: