దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 6,000 కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 148 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
ఇలాంటి సమయంలో పాక్ మాత్రం తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తోంది. మైనారిటీ హిందువుల బస్తీ మొత్తాన్ని నేలమట్టం చేయించి పాక్ తన వికృత రూపాన్ని చాటుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్‌పూర్‌లో ఓ బస్తీ మొత్తాన్ని అక్కడి అధికారులు బుల్ డోజర్ల సహాయంతో నేలమట్టం చేశారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పాక్ గృహనిర్మాణ మంత్రి తారిఖ్ బషీర్, దేశ ప్రధాన సమాచార అధికారి సాహిద్ ఖోఖర్ పర్వవేక్షణలో అధికారులు హిందూ మైనారిటీ ప్రజలను మండుటెండల్లో నిలబెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: