తెలంగాణా సిఎం కేసీఆర్ తో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ భేటీ లో ఆయనకు సినీ పెద్దలు అందరూ కూడా గత రెండు మూడు నెలలుగా తాము పడుతున్న కష్టాలను వివరించారు. దయచేసి తమను ఆదుకోవాలని సినిమాలు లేక చాలా మంది రోడ్డున పడ్డారు అని నిర్మాతలు అప్పుల పాలైపోయారని పేర్కొన్నారు దీనిపై తమ సమస్యలను నివేదిక రూపంలో కేసీఆర్ కి అందించారు. 

 

దయచేసి సినిమాల షూటింగ్ కి అనుమతి ఇవ్వాలని అలాగే సినిమాల విడుదలకు కూడా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సినీ పెద్దలు విజ్ఞప్తి చేసారు. వారి కష్టాలను విన్న కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్ మొదలైతే తాము తీసుకునే జాగ్రత్తలను కేసీఆర్ కి సినీ పెద్దలు వివరించినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: