వరంగలో మృతదేహాలు వెలుగు చూసిన ఘటనపై తెలంగాణా ప్రభుత్వ౦ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. మరణించిన వారి బంధువులను మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించి వారి నుంచి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆమె వారికి వ్యక్తిగతంగా లక్ష రూపాయల సాయం చేసారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయని వదిలేది లేదని స్పష్టం చేసారు. 

 

అదే విధంగా బాధితులను అన్ని విధాలుగా ఆమె ఆదుకుంటామని ఆమె స్పష్టం చేసారు. ఇక ఈ ఘటనపై కేసీఆర్ నివేదిక అడిగినట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే ఆరు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ యువకులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని పట్టుకోవడానికి గాను ఇప్పుడు ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: