జూన్ లో సినిమా షూటింగ్ లో మొదలుపెట్టుకోవచ్చు అని సిఎం కేసీఆర్ సూచించారు. సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం అయిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. సినిమా షూటింగ్ లు మొదలైన తర్వాత థియేటర్స్ గురించి చూద్దామని షూటింగ్ లు, ప్రీ ప్రొడక్షన్ పనులను దశల వారీగా పునరుద్దరించే ఆలోచన చేద్దామని అయన పేర్కొన్నారు. 

 

ముందు ఇండోర్ ప్రొడక్షన్ పనులు చేసుకోవాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. సినీ పరిశ్రమ కారణంగా లక్షలాది మంది బ్రతుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటిస్తూ షూటింగ్ లను చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఇక సినిమా విడుదల గురించి అనవసరంగా తొందర పడవద్దు అని ఆయన సూచనలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: