ఆంఫ‌న్ తుఫాన్‌తో దారుణంగా దెబ్బ‌తిన్న ఒడిశాలో ఈరోజు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ ప‌ర్య‌టించారు. ఏరియ‌ల్ వ్యూ ద్వారా అక్క‌డ జ‌రిగిన న‌ష్టాన్ని అంచ‌నా వేశారు. అక్క‌డి ప్ర‌దేశాల‌ను ముఖ్య‌మంత్రి న‌వీన్‌ప‌ట్నాయ‌క్‌తో క‌లిసి ప‌రిశీలించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తుఫాన్ కార‌ణంగా తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని పేర్కొన్నారు. ఒడిశాకు అండ‌గా ఉంటామ‌ని చెప్పారు.

 

త‌క్ష‌ణ ఆర్థిక సాయంగా రూ.500కోట్లు కేటాయిస్త‌న్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ ఆర్థిక సాయం ఒడిశాలో దెబ్బ‌తిన్న వాటిని తిరిగిపున‌రుద్ధ‌రించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు. కాగా, అంత‌కుముందు ప‌శ్చిమ‌బెంగాల్‌లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఆ రాష్ట్రానికి రూ.వెయ్యికోట్ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు మోడీ. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: