లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ భారీగా నష్టపోయింది. టాలీవుడ్ లో వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరోక్షంగా లక్షల మందిపై దీని ప్రభావం పడింది. దీనిపై సినీ ప్రముఖులు తెలంగాణ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమైన విషయం తెలిసిందే.  తాజాగా, తమ ప్రతిపాదనల వివరాలను పంచుకునేందుకు టాలీవుడ్ పెద్దలు ప్రగతి భవన్ కు తరలివెళ్లారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్, కొరటాల శివ, దిల్ రాజు, ఎన్.శంకర్, సి.కల్యాణ్ తదితరులు సీఎంతో సమావేశమయ్యారు. 

 

ఈ నేపథ్యంలో   సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు టాలీవుడ్ ప్రముఖులు.. షూటింగ్‌లు, ప్రీ ప్రొడక్షన్‌ పునరుద్ధరణ, థియేటర్ల పునఃప్రారంభం తదితరల అంశాలపై చర్చించారు.. షూటింగ్‌లు, థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎంకు విజ్ఞప్తి చేశారు.  కాగా,  జూన్‌లో సినిమా షూటింగ్‌లు ప్రారంభించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు సీఎం కేసీఆర్..   షూటింగ్‌లపై విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

 

ఈ సందర్భంగా మెగాస్టార్ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు.. ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియాకి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని  చెప్పారు.'' అని ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: