దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు చిన్నారులు సహా వృద్ధులతో  రోడ్ల మీద నడిచి వెళ్తున్న వీడియో లు ఫోటోలు ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహిళ తన బిడ్డను సూట్‌కేస్‌పై పడుకోబెట్టుకుని కాలినడకన వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. 

 

ఆమెకు లక్ష రూపాయలు వ్యక్తిగత ఆర్ధిక సహాయం చేసారు ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్. అదే విధంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన తండ్రిని సైకిల్ పై తీసుకుని వెళ్ళిన 15 ఏళ్ళ జ్యోతి అనే బాలికకు కూడా ఆయన లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేసారు. హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్‌లోని దార్భంగ వరకు ఆమె సైకిల్ తొక్కింది. దాదాపు 1200 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: