కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ సడలింపుల‌తో జ‌మ్ముక‌శ్మీర్‌లో వివిధ శాఖలు తెరుచుకున్నాయి. ఉద‌యం 10గంట‌ల నుంచి సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే షాపులు తెరిచి ఉండేలా అనుమ‌తులు ఇచ్చింది ప్ర‌భుత్వం. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి వారికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అన్నిషాపులు కూడా సందడిగా మారుతున్నాయి. ప్ర‌ధానంగా రంజాన్ పండుగ‌కు ముందు షాపులు తెరుచుకోవ‌డంతో ముస్లింలు ఆనందంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి పండుగ సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు.

 

కొత్త‌బ‌ట్ట‌లు, చెప్పులు.. కొనుగోలు చేస్తూ సంద‌డి చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉండేలా ఉత్తర్వులు జారీ చేయ‌డంతో త్వ‌ర‌గా వారి పని ముగించుకుని తిరిగి ఇళ్ల‌కు వెళ్లిపోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: