లాక్ డౌన్ కారణంగా సినిమాలు లేకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ బాబు సందడి చేస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అతను తన పిల్లలతో గడుపుతున్న వీడియో లను ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అలరిస్తూ వస్తున్నాడు. నిన్న తన భార్యతో ఉన్న ఒక వీడియో ని మహేష్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. 

 

తాజాగా తన కొడుకుతో ఉన్న ఒక వీడియో ని పోస్ట్ చేసాడు. ఈ వీడియో లో మహేష్ బాబు గౌతం ఇద్దరూ కూడా ఎదురెదురుగా ఉంటూ మహేష్ బాబు కమాన్ కమాన్ అంటూ ఉంటాడు. ఇక మధ్యలో  మహేష్ కూతురు వస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: