వాళ్లకు చదువు లేదు, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ నాగరికత నేర్పే వాళ్ళు కూడా ఎవరూ లేరు. అయినా సరే కరోనా విషయంలో వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. అదే తూర్పు గోదావరి జిల్లా మన్యం గ్రామాలు. ఆ గ్రామాల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా కరోనా కేసు లేదు. 

 

అక్కడి నుంచి వేలాది మంది వలస కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు. అయినా సరే మన్యంలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. మన్యం గ్రామాల నుంచి ఎవరు బయటకు వెళ్ళడం లేదు. ఎవరిని కూడా అడుగు పెట్టనీయడం లేదు. 170 గ్రామాలు ఉన్నాయి. అయినా సరే ఒక్క కేసు కూడా అక్కడ నమోదు కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: