కరోనా కారణంగా ఇప్పుడు ఎక్కువగా నష్టపోయింది విద్యార్ధులే అనేది వాస్తవం. స్కూల్ కి వెళ్ళే పరిస్థితి లేదు చదువుకునే పరిస్థితి అంతకన్నా లేదు. దీనిపై ఆందోళన వ్యక్తమైంది. ఇక ఇప్పుడు కరోనా నుంచి కొన్ని రాష్ట్రాలు బయటపడటం తో స్కూల్స్ ని ఓపెన్ చేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా చాలా తక్కువగా ఉంది. 

 

ఈ నేపధ్యంలో సిక్కింలో పాఠశాలలు, కళాశాలలను జూన్ 15వతేదీ నుంచి తిరిగి తెరవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేఎన్ లెప్చా వెల్లడించారు. 9 నుంచి 12 వతరగతి విద్యార్థులకు జూన్ 15వతేదీ నుంచి తరగతులు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. నర్సరీ నుంచి 8వతరగతి విద్యార్థులకు తరగతుల గురించి తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: