ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసి బస్సులు రెండు మూడు రోజుల నుంచి బస్సులు తిరుగుతున్నాయి. దీనితో ప్రజల రవాణా కష్టాలు తీరిపోయాయి అని భావించారు అందరూ. అయితే ప్రజలు మాత్రం బస్సులు ఎక్కడానికి భయపడుతున్నారు. బస్సులు అన్నీ కూడా జిల్లాలో చాలా వరకు ఖాళీ గా తిరుగుతున్నాయని అధికారులు మీడియా కు వివరించారు. 

 

జిల్లాలో బస్సుల ఆక్యూపెన్సీ రేటు కేవలం 17.5 శాతం ఉందని ఆర్టీసి అధికారులు చెప్పుకొస్తున్నారు. సాధారణ రోజుల్లో 75శాతం వరకు ఆక్యుపెన్సీ రేటు ఉండేదని... కాని ఇప్పుడు అలా లేదని అంటున్నారు. మొదటి రోజు 109 బస్సులు రెండో రోజు 131బస్సులను జిల్లాలో తిరిగాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: