క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని గ‌ల్ఫ్ దేశాలు విల‌విల‌లాడుతున్నాయి. ప్ర‌ధానంగా సౌదీ అరేబియా, ఖ‌తార్‌, యూఏఈలో వైర‌స్‌ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. యూఏఈలో ఈ మ‌హ‌మ్మారి‌ రోజురోజుకూ తీవ్ర‌రూపం దాల్చుతోంది. దీంతో నిన్న‌ ఒక్క‌రోజే 994 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఈ 994  కొత్త కేసుల‌తో క‌లిపి యూఏఈలో క‌రోనా బాధితుల సంఖ్య 27,892కి చేరింద‌ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

 

అలాగే 1,043 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13,798కి చేరింది. శుక్ర‌వారం సంభ‌వించిన నాలుగు మ‌ర‌ణాల‌తో‌ క‌లిపి ఆ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య‌ 241కు చేరుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: