బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుశ్క శర్మ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఆమె ఇటీవల తీసుకొచ్చిన ఒక బయోపిక్ లో వివక్ష పూరిత సన్నివేశాలు ఉన్నాయని ఫిర్యాదులు వెళ్ళాయి. ఆమెపై గూర్ఖా కమ్యూనిటీ గ్రూపు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం. పాతాళ్‌ లోక్‌ అనే ఒక వెబ్‌ సిరీస్‌లో తమను కించపరిచే, వివక్ష పూరిత సన్నివేశాలు ఉన్నాయని ది అరుణాచల్‌ ప్రదేశ్‌ గూర్ఖా యూత్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు చేసింది. 

 

భారతీయ గూర్ఖా యువ పరిసంఘ్‌ అధ్యక్షుడు నందా కిరాటి దేవన్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ వెబ్ సీరీస్ లో తమను అవమానించే విధంగా సన్నివేశాలు ఉన్నాయని తమ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఆన్నాయని వాటిని డిలీట్ చెయ్యాలని అతను  డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: