చేసిన తప్పులు దండతో సరి.. అన్నట్టు ఉంది ఢిల్లీ అధికారుల తీరు.  దేశంలో గత రెండు నెలల నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపత్యంలో ఇటీవల వలస కూలీలను తమ స్వస్థలాలకు వెళ్లొచ్చు అని కేంద్రం చెప్పింది.  అంతే కాదు కొన్ని చోట్ల లాక్ డౌన్ సడలింపులు కూడా చేసింది.  ఈ నేపత్యంలో  న్యూఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్య పరీక్షల కోసం నిలుచున్న కూలీలపై సిబ్బంది రసాయనాలు పిచికారీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వలస కూలీలు తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు శ్రామిక్ రైలు కోసం ఎదురు చూస్తున్నారు. 

 

ఇక  శ్రామిక్‌ రైలులో ప్రయాణించి వందలాది మంది కూలీలు ఢిల్లీలోని లజ్‌పత్‌ నగర్‌ బడి వద్దకు చేరుకున్నారు. అక్కడ వారికి కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి రోడ్ల పక్కన పిచికారీ చేస్తోన్న సిబ్బంది, కూలీలపై కూడా స్ప్రే చేశారు. అయితే తాము రోడ్డు పక్కన ఉంటే.. ఇలా దారుణంగా పిచ్చికారీ చేయడం ఏంటీ అని వారు ప్రశ్నించారు.  దీనిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది.  దీనిపై స్పందించిన అధికారులు పొరపాటున కూలీలపై స్ప్రే చేశారని చెప్పుకొచ్చారు. కాగా, ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లోనూ కూలీలపై స్ప్రే చేయడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: