గత కొన్ని రోజుల నుంచి జూమ్ యాప్ గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా సుప్రీం కోర్టులో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్‌ను బ్యాన్ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎస్ ఏ బోబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ హ్రిషికేశ్‌లతో కూడిన ధర్మాసనం జూమ్ యాప్ గురించి నాలుగు వారాల్లో స్పందించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 
 
ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిపన్షన్ జూమ్ యాప్ లో లేదని... యాప్ లోని లోపాల వల్ల సమాచారం ఇతరులకు తెలిసే అవకాశం ఉందని ఒక గృహిణి పిటిషన్ దాఖలు చేశారు. జూమ్ సమాచార భద్రత విషయంలో తగిన ప్రమాణాలు పాటించడం లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత సమాచారం భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నా కేంద్రం ఈ యాప్ ను బ్యాన్ చేయలేదని.. పలు దేశాలు ఈ యాప్ ను బ్యాన్ చేశాయని పిటిషన్ లో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: