మే 26వ తేదీ దాకా తమ రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక రైళ్లను పంపవద్దని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పశ్చిమబెంగాల్‌ చీఫ్‌ సెక్రెటరీ రాజీవ్‌ సిన్హా రైల్వే బోర్డుకు లేఖ రాశారు. అంఫాన్‌ తుఫాన్ కార‌ణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రక్షణ, పునరావాస చర్యలు చేపట్టడంతో రాష్ట్రానికి చెందిన అధికారులు తీరక లేకుండా ఉన్నందున, ఇప్పుడు ప్రత్యేక రైళ్లను రిసీవ్‌ చేసుకునే అవకాశం లేదని, అందువల్ల మే 26 దాకా రైళ్లను పంపవద్దని ఆ లేఖలో పేర్కొన్నారు.

 

*మే 20, 21 తేదీల్లో అంఫాన్‌ తుఫాన్ పశ్చిమబెంగాల్‌లో ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలుసు. దీంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలు బాధితుల కోసం రక్షణ, పునరావాస చర్యలు చేపట్టడంలో తీరిక లేకుండా ఉన్నారు. అందువల్ల మే 26వ తేదీ వరకు దయచేసి ఎలాంటి రైళ్లను కూడా మా రాష్ట్రానికి పంపకండి* అని రాజీవ్‌ సిన్హా లేఖలో పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: