దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ మెడికల్ జర్నల్ ది ల్యాన్సెట్ లో మనుషులపై తొలి దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరిన తొలి కరోనా వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలిచ్చినట్టు పేర్కొంది. 108పై వ్యాక్సిన్ ప్రయోగించగా 28 రోజుల తరువాత ఆశాజనక ఫలితాలు వచ్చినట్లు సమాచారం. 
 
అయితే ఈ వ్యాక్సిన్ గురించి మరింత పరిశోధనలు జగరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ జలుబుకు కారణమయ్యే అడినోవైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారిపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించగా 75 శాతం మందిలో యాంటీ బాడీస్ విడుదలయ్యాయని...చాలా తక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని వారు చెబుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: