టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన పాత్రలు మ‌రెన్నో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా నాగార్జునకు న‌చ్చిన‌ రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అన్నమయ్య చిత్రం. ఈ స‌నిమా మే 22న విడుద‌లై ఎంతటి ఘనవిజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర అద్భుతమ‌నే చెప్పొచ్చు. ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరలేదంటే అతిశయోక్తికాదేమో..!

 

అలాగే మరో చిత్రం *మనం*. ఈ సినిమా మే 23వ తేదీన విడుద‌ల అయింది. ఈ సినిమాలో అందరూ నాగార్జున కుటుంబ సభ్యులే న‌టించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ‌చైత‌న్య‌, సమంత, అఖిల్‌ తదితరులు నటించారు. ఈ రెండు చిత్రాల‌ను కూడా తెలుగు ప్రజలు ఎన్నటికీ మరచి పోరు. అందుకే ఈ రెండు సినిమాలు విడుదలైన తేదీలు మే 22, మే 23 వ తేదీలు  తనకు ఎంతో స్పెషల్ అని, తాను ఎన్న‌టికీ మరువలేని తేదీలని ఆయన ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: