నియంతృత వ్యవసాయంపై తెలంగాణా సిఎం కేసీఆర్ ప్రకటనలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు రైతులను గందరగోళంలో పడేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు ఏ పంట వేయాలనే నియంత్రణ లేదని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

 

తన భూమిలో ఏ పంట వేయాలో రైతుకు తెలుసని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రైతు పంటకు రైతు బంధు కు లింకు పెట్టడం దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేసారు. ఏ పంట వేసుకోవలో కూడా రైతుకు స్వేచ్ఛ లేకుండా పోతోందని ఆయన ఆరోపించారు. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. రైతుబంధుతోనే రైతులు బతుకుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారన్నారు కేసీఆర్.  రైతుబంధు ను తప్పించడానికే షరతులు పెడుతున్నారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: