ఈ మద్య అడవిలో ఉండాల్సిన కృరమృగాలు, పక్షలు, సాదు జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి.  ఇటీవల హైదరాబాద్ లో చిరుత చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక గ్రామాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.. పొలాల్లో, గ్రామాల్లో ఎలుగు బంట్లు, పులులు సంచరిస్తున్నాయి.  తాజాగా ఓ కారు వద్దకు వచ్చిన సింహం డోరు తీయడంతో అందులోని అమ్మాయిలు గజగజా వణికిపోయి భయంతో కేకలు పెట్టారు.  గుజరాత్‌లో ఓ నిండు గర్భిణీ భయంకరమైన పరిస్థితి ఎదుర్కుంది. నట్టడవిలో ప్రసవించాల్సిన పరిస్థితి వచ్చింది. గిర్ అటవీ ప్రాంతంలో  జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఐతే  పూర్తిగా సక్రమంగా జరిగింది కాబట్టి.. అంతా ఊపిరిపీల్చుకున్నారు.

 

తాజాగా ఓ కారు వద్దకు వచ్చిన సింహం డోరు తీయడంతో అందులోని అమ్మాయిలు గజగజా వణికిపోయి భయంతో కేకలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీలోని ఓ అటవీ ప్రాంతంలోకి వచ్చిన పర్యాటకులు ఓ ప్రాంతంలో  కారుని ఆపి సింహాలను చూశారు. వాటిని వీడియో తీస్తూ ముచ్చట్లు చెప్పుకున్నారు. అప్పటికీ కారు డోర్ వేశారు అందులో ఉన్న అమ్మాయిలు.. కానీ ఆ సింహం తన బలమైన పన్నుతో కార్ డోర్ లాగేసింది. దీంతో కారులోని అమ్మాయిలు భయంతో కేకలు వేస్తూ డోరును మళ్లీ మూసేశారు. ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: