మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ఈ మద్య తన సోషల్ మద్యమంలో చేస్తున్న హల్ చల్ గురించి అందరికీ తెలిసిందే.  ఈ రోజు కూడా కరెన్సీ నోట్లపై తన వ్యక్తి గత అభిప్రాయం వెల్లడించారు.  మొన్న గాంధీని చంపిన నాధూరాం గాడ్సే ఒక దేశ భక్తుడే అని అభిప్రాయం వెల్లడించారు.  గత ఏడాదిగా ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మాద్యమం ద్వారా హడావుడి చేస్తున్నారు. తాజాగా ఈ విషయం పై జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కళ్యాన్ స్పందించారు.  జనసేన పార్టీలో లక్షల సంఖ్యలో ఉన్న కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవని, వాటితో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

 

 నాగబాబు చేసిన వ్యాఖ్యలపై విమర్శలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ స్పందించారు.కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారని, వాటిని కూడా పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున ఈ వివరణ ఇస్తున్నామని పవన్ వెల్లడించారు. ఇక అన్నయ్య సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీపరమైన నిర్ణయాలు, అభిప్రాయాలను జనసేన అధికారిక పత్రం ద్వారా, పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని తెలిపారు. అంతే కాదు ఈ సందర్భంగా జనసైనికులందరికీ పవన్ విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్న సమయంలో, ప్రజాసేవ తప్ప మరో అంశం జోలికి వెళ్లవద్దని కోరుతున్నట్టు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: