కరోనా వైరస్ ప్రభావం భారత ఆర్మీకి కూడా తీవ్రంగా తగిలిన సంగతి తెలిసిందే. సైనికుల్లో కరోనా రావడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. వారు కరోనా కట్టడిలో భవిష్యత్తు లో కీలకం అయ్యే అవకాశం ఉందని వారికి కరోనా వస్తే ఎలా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో పహారా కాసే సైనికులకు కరోనా రావడం ఆందోళన కలిగించే అంశం. 

 

భారత్ టిబెట్ సరిహద్దుల్లో ఉండే సైనికులకు కరోనా సోకడం ఆందోళన కలిగించింది. ఇక అక్కడ పటిష్ట చర్యలతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనితో గత 24 గంటల్లో ఇండో టిబిటేన్ బోర్డర్ పోలీస్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు. 93 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: