టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చినా.. ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా మారాడు.  తొలి సినిమాతోనే మహేష్‌కు దర్శకుడు  రాఘవేంద్రరావు భారీ విజయం అందించారు. ఈ రోజు (శనివారం) రాఘవేంద్రరావు జన్మదినోత్సవం.  ఈ సందర్బంగా రాఘవేంద్రరావుకి సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు.  ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం శుభాకాంక్షలు తెలిపారు.

 

`హ్యాపీ బర్త్‌డే మామయ్య. మీలాంటి దిగ్గజ దర్శకుడితో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీ ఆరోగ్యం బాగుండాలని, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా` అని మహేష్ ట్వీట్ చేశాడు. `రాజకుమారుడు` షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోను షేర్ చేశాడు. తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

 

రాజకుమారుడు చిత్రం మహేష్ బాబు కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింద.  తన మొదటి చిత్రంతో మంచి విజయాన్ని అందించిన రాఘవేంద్ర రావు ని ఎప్పటికీ మర్చిపోలేనని పలు సందర్భంగా మహష్ బాబు అంటుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: