కారుని శుభ్రం చేసి డబ్బులు వసూలు చేసినందుకు గానూ ఒక కారు డీలర్ కి కస్టమర్ షాక్ ఇచ్చారు. ఈ ఘటన చండీగడ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కారు ఓనర్ రవి కుమార్ తన కారును ఈ నెల 21న ఆటో పేస్ డీలర్‌షిప్ వద్దకు రొటీన్ సర్వీస్ చెకప్ కి తీసుకుని వెళ్ళారు. ఇంటీరియర్ ప్రొటెక్షన్ కవర్స్‌కు రూ.14.83; హైజీన్ ఛార్జీలుగా రూ.175, వీటిపై జీఎస్‌టీ 18 శాతం, మొత్తం మీద రూ.224 వసూలు చేసారు. 

 

అయితే కారు వారంటీ పరిధిలో ఉందని అందుకు సర్వీసుకు ఏ విధంగా వసూలు చేస్తారని రవి కుమార్ ప్రశ్నించారు. అలా వసూలు చేసినందుకు గానూ.. వారంటీ పరిధిలో ఉన్న కారుకు ఈ విధంగా వసూలు చేసిన సొమ్మును తిరిగి తనకు ఇవ్వాలని... నష్టపరిహారంగా రూ.50,000 చెల్లించాలని డిమాండ్ చేయడం విశేషం. లాయర్ ద్వారా లీగల్ నోటీసు  పంపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: