తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఆ రాష్ట్రంలో మాత్రం కట్టడి అయ్యే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక అక్కడ రోజు కూడా 700 పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

 

తాజాగా మరోసారి అక్కడ అదే స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. 759 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 624 కేసులు చెన్నై నుంచే వచ్చాయి. 363 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కేసుల సంఖ్య   15,512 కి చేరుకుంది. 7491 మంది పూర్తిగా కోలుకున్నారు. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: