మనం చేసే మంచిపనిలో మనం కనిపించకున్నా పరవాలేదు.. ఆ పనితో అవతలి వ్యక్తి లాభం పొందితే చాలు అంటారు గొప్పవారు. నిజమే.. ప్రపంచాన్ని అష్ట కష్టాలు పెడుతున్న కరోనా భూతాన్ని తరిమి కొ్ట్టేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ఎవ్వరి వల్ల కావడం లేదు. కాకపోతే కరోనా రాకుండా కొన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తే ఒంటికి మంచిదని అంటున్నారు డాక్టర్లు. భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడటం.. మాస్క్ ధరించడం..ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. అయితే పేదవారికి శానిటైజర్, మాస్క్ లు కొనాలన్నా చుక్కల్లో ధరలు ఉన్నాయి. దాంతో చాలా మంది శానిటైజర్, మాస్క్ లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి ప్రణిత ఆటో డ్రైవర్స్‌కి శానిటైజర్స్ పంపిణీ చేసింది నటి ప్రణీత.
కరోనా మొదలైనప్పటి నుంచి ప్రణిత ఎంతో మందికి తన వంతు సహాయం చేస్తు వచ్చింది. ఎంతో మంది స్వయంగా భోజనం వండి మరీ అన్నదానం చేసింది. బెంగళూరులో ఆటోలు తిరగడం మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో అప్రమత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆటోడ్రైవర్స్, కస్టమర్స్‌ను వేరు చేసేలా షీట్స్ ఉండటం ఎంతో ముఖ్యం. కాబట్టి 100కి పైగా ఆటోడ్రైవర్స్‌కు ఇలాంటి షీట్స్‌తో పాటు శానిటైజర్స్‌ను కూడా పంపిణీ చేశాం అని ప్రణీత తన ట్వీట్ లో తెలిపింది. ప్రణీత చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.
Autos hav started plying in the city & it’s very imp to maintain good hygiene. Transp Sheets to separate the customer & auto drivers is a must. Thought we can provide this to 100+ drivers along with a bottle of chemical to sanitise handles and interiors of the auto b/w customers pic.twitter.com/kXF7B1Xf1D
— Pranitha Subhash (@pranitasubhash) May 22, 2020