నిన్న‌మొన్న‌టివ‌ర‌కు యూర‌ప్‌, అమెరికా త‌దిత‌ర దేశాల‌ను వ‌ణికించిన కరోనా మ‌హ‌మ్మారి ఇప్పుడు లాటిన్‌ అమెరికాను బెంబేలెత్తిస్తోంది. ఇక్క‌డ‌ కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బ్రెజిల్, మెక్సికోలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ను సరిగ్గా అమలు చేయకపోవడంతో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

 

లాటిన్‌ అమెరికాలో ఇప్పటిదాకా ఆరు లక్షల కేసులు నమోదయ్యాయి. 30వేల మందికిపైగా మరణించారు. చిలీ, పెరూ, ఈక్వెడార్‌లో కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో పెరూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: