అమెరికాలో క‌రోనా వైర‌స్ కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ‌తంతో పోల్చుకుంటే.. ప్ర‌స్తుతం రోజువారీ మ‌ర‌ణాలు త‌గ్గుతుండ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని విశ్లేషకులు చెబుతున్నారు. గ‌త 24 గంట‌ల్లో 1127 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 98,683 మంది చనిపోయారు. ఇక కేసుల సంఖ్య సుమారు 17ల‌క్ష‌ల‌కు చేరువ‌లో ఉంది. అదేవిధంగా కరోనా వైర‌స్‌ ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు వ్యాపించింది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,01,612కు చేరుకుంది.

 

వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 లక్షల 10 వేల 657. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల 43 వేల 804 మంది మృత్యువాతపడ్డారు. వ్యాధి నుంచి కోలుకుని 22 లక్షల 47 వేల 151 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. క‌రోనాతో బ్రెజిల్‌లో 22,013 మంది, రష్యా-3,388, స్పెయిన్‌-28,678, యూకే-36,675, ఇటలీ-32,735, ఫ్రాన్స్‌-28,332, జర్మనీ-8,366, టర్కీ-4,308, ఇరాన్‌-7,359, పెరూ-3,373, కెనడా-6,355, చైనా-4,634, మెక్సికో-7,179, బెల్జియం-9,237, పాకిస్థాన్‌-1,101, నెదర్లాండ్స్‌-5,811, ఈక్వెడార్‌-3,096, స్వీడన్‌-3,992, స్విర్జర్లాండ్‌-1,905, పోర్చుగల్‌-1,302, ఐర్లాండ్‌-1,604, ఇండోనేషియా-1,351, రోమేనియాలో 1,176 మంది మ‌ర‌ణించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: