క‌రోనా వైర‌స్ క‌ష్ట‌కాలంలోనూ కొంద‌రు త‌మ దొంగ‌బుద్ధిని చూపించ‌కుంటున్నారు. ఏకంగా క‌రోనా వైర‌స్‌తో మృతి చెందిన వారి న‌గ‌లు, ఇత‌ర వ‌స్తువుల‌ను కూడా కొట్టేస్తున్నారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లో వెలుగులోకి వ‌చ్చింది. అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చోరీ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డం క‌ల‌క‌ల రేపుతోంది. కరోనాతో మృతిచెందిన వారి న‌గ‌లు, దుస్తులు, ఫోన్లు చోరీకి గుర‌య్యాయ‌ని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేసి, చోరీకి పాల్ప‌డిన సివిల్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

కాగా గుజరాత్‌లో 13 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం గుజరాత్‌లో కొత్తగా 396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 13,699కు పెరిగింది. గుజరాత్‌లో కరోనా ప్రభావం గణనీయంగా ఉంది. ఇప్పటివరకు 800 మందికి పైగా మృతిచెందారు. కరోనా వారియర్స్ ప్రజలను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: