జమ్మూకశ్మీర్‌లోని బుద్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాది వసీం ఘనీని పోలీసులు అరెస్టు చేశారు. బుద్గాం పోలీసులు, ఇండియన్‌ ఆర్మీ సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో లష్కరే ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఉగ్రవాదులకు సాయం చేస్తున్న మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆయుధాల సరఫరాకు తోడ్పాటును ఇస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

 

ఇటీవ‌ల ముజాహిద్దీన్‌కు చెందిన ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను కూడా పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఎవ‌రికీ అనుమానం రాకుండా ఉగ్ర‌వాదుల‌కు స‌మాచారం అందిస్తున్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో వారిని అరెస్టు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: