కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో వైద్యులు చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళే కనపడే దేవుళ్ళు అనేది అక్షరాలా నిజం. ఇక వీరి గురించి ట్విట్టర్ లో యువ సంగీత దర్శకుడు తమన్ ఒక ట్వీట్ చేసారు. అది ఏంటీ అంటే... 

 

24 గంటలు మన కోసం తమ సొంత వారిని వదిలి కష్టపడుతున్న వైద్యుల కోసం మనం ప్రార్ధన చేద్దాం. వాళ్ళు మన కోసం జీవితాలను కూడా త్యాగం చేస్తున్నారు. ఇంట్లో ఉందాం సమాజానికి సేవ చేస్తున్న వంద మంది వైద్యులను కాపాడుకుందాం అంటూ తమన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఒక డాక్టర్ ఫోటో పెట్టి ఇది పోస్ట్ చేసారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: