రంజాన్ సమయంలో కరోనా వైరస్ రావడంతో ఇప్పుడు చాలా మంది ముస్లిం లు నిరాశగా ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇప్పుడు రంజాన్ ని స్వేచ్చగా జరుపుకునే వాతావరణం దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇక రంజాన్ ని జరుపుకునే విషయంలో ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు దయచేసి రావొద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

కరోనా కారణంగా తాము ఇంట్లోనే ఉండి రంజాన్ ప్రార్ధనలు చేస్తున్నామని కాని అది పండుగ స్పూర్తిని ప్రభావితం చేయదని పేర్కొన్నారు. కరోనా వైరస్ ని దేశం త్వరగా వదిలించుకోవాలని తాము ప్రార్దిస్తామని మంత్రి మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: