దేశంలో కరోనా బాధితుల సంఖ్య , కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా అనుమానితులను క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచి వారికి మంచి ఆహారాన్ని అధికారులు అందిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో తాము అడిగినవి ఇవ్వలేదని కొందరు దాడులకు దిగుతున్నారు. పెద్దలకు కోడికూర, చేపలు, పిల్లలకు చిప్స్‌ ఇవ్వలేదనే కోపంతో ఒక వ్యక్తి ఆశా కార్యకర్తపై దాడి జరిపాడు. 
 
కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగిలో క్వారంటైన్‌లో ఉన్న సోమనాథ సోనకాంబళె అనే వ్యక్తి చికెన్, చేపలతో భోజనం ఇవ్వాలని ఆశా కార్యకర్త రేణుకను కోరాడు. ఉన్నతాధికారుల సూచనలను అనుసరించి తాము భోజనం అందిస్తున్నామని ఆమె సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి ఆమె చేతిని విరిచేశాడు. ప్రస్తుతం ఆమె చేయి విరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు సోమానాథపై కేసు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: