ఇప్పుడు ప్రపంచం మొత్తం గుడిలా చూస్తుంది ఒక్క ఆస్పత్రినే అనే విషయాన్నీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారుగా ఇప్పుడు డాక్టర్లను దేవుళ్ళు గా చూసే వాతావరణం ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. వారికి అన్ని విధాలుగా ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 

 

ఇలాంటి తరుణంలో చత్తీస్గఢ్ లోని బిలాస్ పూర్ లో దారుణం జరిగింది. గత 2 రోజులుగాతన కుమార్తెను ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసియులో అత్యాచారం చేసారని.. ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఐపిసి సెక్షన్ 376 కింద కేసు నమోదు హేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని పరివేష్ తివారీ అనే స్టేషన్ ఇన్‌ఛార్జ్,  మీడియాకు వివరించారు. ఏ ఆస్పత్రి అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: