దేశంలో ముందు కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి అని ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్ర౦ రాజస్థాన్. ఆ రాష్ట్రంలో కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ప్రయోజన౦ లేదని భావించారు అందరూ. కాని అక్కడ మాత్రం అనూహ్యంగా కేసులు తగ్గాయి. వందల కేసులు నమోదు అవుతాయి అనుకున్న రాష్ట్రంలో కేవలం పదుల సంఖ్యలోనే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. 

 

అక్కడ కరోనా కేసులు నేడు 52 నమోదు అయ్యాయి అని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనితో కేసుల సంఖ్యా 6794 కి చేరుకుంది. అయితే అక్కడ మరణాలు చాలా వరకు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఏది ఎలా ఉన్నా గెహ్లాట్ ప్రభుత్వం కరోనా కట్టడిలో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: