వృద్దులకు కరోనా వైరస్ వస్తే ఇక బ్రతికే అవకాశం లేదు అనేది చాలా మంది మాట. కరోనా నుంచి వాళ్ళు బయటపడటం అనేది చాలా మందికి ఉన్న అభిప్రాయం కూడా. కరోనా నుంచి ఇప్పుడు చాలా దేశాల్లో వృద్దులు కోలుకుని బయటపడుతున్నారు. దాదాపు అన్ని దేశాల్లో కూడా వృద్దులు కరోనా నుంచి కోలుకుని బయటపడుతున్నారు. 

 

తాజాగా అమెరికాలో ఒక సంఘటన జరిగింది. అది ఏంటీ అంటే ఒక వృద్ద జంట కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది, నెలల తర్వాత వాళ్ళు ఇద్దరూ కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డారు. వాళ్ళ ఇద్దరి వయసు దాదాపు 90 ఏళ్ళు అన్నమాట. వారిది 70 ఏళ్ళ వివాహ బంధం కూడా. కరోనా నుంచి బయటపడిన తర్వాత 89 ఏళ్ల జీన్ మరియు 91 ఏళ్ల వాల్టర్ విల్లార్డ్, న్యూయార్క్ లోని ట్రాయ్లోని నర్సింగ్ హోమ్లో తిరిగి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా మాట్లాడుకుని లిప్ లాక్ ఇచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: