సిని పరిశ్రమకు సింగిల్ విండో అనుమతులు ఇచ్చిన ఏపీ సిఎం వైఎస్ జగన్ కి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సిఎం జగన్ కి సినీ పరిశ్రమ తరుపున ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ ప్రముఖులను కలుస్తా అని సిఎం జగన్ చెప్పారని ఆయన గుర్తు చేసారు. 

 

ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో సినిమాల షూటింగ్ ని ప్రోత్సహించడానికి గానూ సిఎం వైఎస్ జగన్ సింగిల్ విండో అనుమతులు ఇచ్చారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. సినిమాల షూటింగ్ లను సీరియల్ షూటింగ్ లను ఏపీలో స్వేచ్చగా చేసుకోవచ్చని జగన్ పేర్కొన్నారు. దీనిపై సినీ పరిశ్రమ నుంచి హర్షం వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: