వలస కార్మికులు పడుతున్న బాధలపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. లాక్‌డౌన్‌లో వలస కార్మికుల దుస్థితికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే కారణమని ఆమె ఆరోపించారు. వలసలపై రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రం కానీ సరిగా దృష్టిసారించలేదని ఆమె మండిపడ్డారు. వలస కార్మికుల ఆకలి మరణాలు మొదలుకావడం నుంచి పనిచేసే కంపెనీలు జీతాలు ఇవ్వకపోవడంతో మరో గత్యంతరం లేకనే వాళ్ళు సొంత రాష్ట్రాలు వెళ్తున్నారని అన్నారు. 

 

ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. వారి పరిస్థితికి ఆ రెండు పార్టీలదే బాధ్యత అన్నారు. పేదల కష్టాలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని ఆమె మండిపడ్డారు. బిజెపి బిఎస్పీ కలవడం లేదన్నారు ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: